నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయకుల నిమజ్జనం ఏర్పాట్ల కొరకై మల్కా చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏర్పాటుచేసిన వినాయకుల నిమజ్జనం కొరకై మల్కా చెరువును సందర్శించామన్నారు. చెరువులని నిండికుండలా ఉండడంతో నిమజ్జనం చేసేటప్పుడు యువకులు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొనవద్దన్నారు. చెరువుల వద్దకు వినాయకులను నిమజ్జనం చేసేటప్పుడు చిన్నపిల్లలను తీసుకురావద్దనితల్లిదండ్రులకు సూచించారు. నిమజ్జనం కొరకై అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నర్సింలు, కానిస్టేబుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.
మల్కా చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లకు సీఐ శ్రీనివాస్ రెడ్డి సందర్శన
