ముంబై ఎయిర్పోర్ట్లో నటుడు రానా దగ్గుబాటికి ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి.ఫొటోగ్రాఫర్లు వెంటాడడంతో రానా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తున్న రానాను మిడియా ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. అప్పటికే ఫొటోలు తీయొద్దని స్పష్టంగా చెప్పినా, వెంటపడుతూ, కెమెరాలను ఎదురుగా పెట్టడంతో రానా కోపంగా మారారు. రానా ఓ మహిళను అనుకోకుండా ఢీకొట్టాడు.ఈ గందరగోళంలో రానా చేతిలో ఉన్న మొబైల్ కిందపడిపోయింది. కోపంగా రానా ”ఎందుకిలా చేస్తున్నారు? కొంచెం స్పేస్ ఇవ్వండి!” అంటూ ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఫొటోగ్రాఫర్ల వేధింపులతో రానా అసహనం – ముంబై ఎయిర్పోర్ట్లో అపశృతి!”
