ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా ఏర్పడిన గందరగోళంపై కర్ణాటక క్రికెట్ సంఘం (KSCA) హైకోర్టును ఆశ్రయించింది. తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ విజయోత్సవాల నిర్వహణ మా నిర్ణయంతో కాదు, ప్రభుత్వ ఆదేశాలతోనే జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించలేమని, అందుకే ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలు అనుసరించామని పిటిషన్‌లో పేర్కొన్నారు.గందరగోళం నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులకు KSCA స్పష్టంగా స్పందించింది. అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత తమపై లేదని, ఆర్సీబీ మేనేజ్‌మెంట్ & పోలీసులదేనని వివరించింది. తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలి. ప్రభుత్వం ఆదేశాల మేరకే కార్యక్రమం జరిగింది. కంట్రోల్ ఫెయిల్యూర్ ఎక్కడయినా జరిగితే అది లా & ఆర్డర్ విభాగానికి చెందినది.








