ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు 100 రోజులు పూర్తైన సందర్భంగా మడుతూరు గ్రామంలో గోడపత్రిక ఆవిష్కరణ జనసేన నేత మోటూరు శ్రీ వేణి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ 100 రోజుల్లో ప్రభుత్వం సామాజిక పెన్షన్ల పెంపు, నిరుద్యోగుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి పథకాలు ప్రారంభించిందని ఆమె అన్నారు.
గ్రామ స్వరాజ్యం దిశగా పంచాయతీల బలోపేతం కోసం 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడమే కాకుండా, ఇతర సామాజిక సంక్షేమ పథకాలు ప్రారంభించినట్లు వివరించారు.
కర్నూలులో మంచినీటి లేని గిరిజన తండాలకు మంచినీరు అందించడంతోపాటు, పేదలకు ఉచిత సిలిండర్ పథకాన్ని దీపావళి నాటికి అమలు చేస్తామని మోటూరు శ్రీ వేణి హామీ ఇచ్చారు.
ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అచ్యుతాపురం నాలుగు కూడలి విస్తరణ పనులు, నేవీ నిర్వాసితుల సమస్యలు, శేషుగడ్డ కాలువ పనులను సాధించేందుకు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
సుందరపు విజయ్ కుమార్ ప్రజల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా కలిగించారని, ఆయన సేవలను ఆమె ప్రశంసించారు.
ఈ 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుందన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.