పిఠాపురం నియోజకవర్గ పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మేల్యే వర్మ మాట్లాడుతూ నిన్న జరిగిన విద్య కమిటి ఎన్నికలలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు BJP పార్టీల కూటమి అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఈ రోజు ZPHS, MPUP, MPPS, సోషల్ వెల్ఫేర్, టౌన్ లలో ప్రభుత్వ హై స్కూల్, మున్సిపల్ స్కూల్ లో విద్యకమిటి చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిటి మెంబెర్స్ గా ఎన్నికయిన కూటమి సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. TDP ZPHS 11, MPUP 18 మరియు MPPS 79 స్కూల్ లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇప్పుడు నెగ్గిన వారందరూ రేపుటి నుండి స్కూల్ లలో గల పాఠ్యాంశాల, విద్యా కార్యక్రమాల రూపకల్పన మరియు నవీకరణ. విద్యా నిబంధనల ఆధారంగా పాఠ్యాంశాలను సరిదిద్దడం, విద్యార్థుల ప్రవేశం, ఉపాధ్యాయుల నియామకం, శిక్షణా కార్యక్రమాల నిర్వహించడం, విద్యా ప్రణాళికలు మరియు విధానాలను సమీక్షించడం, అవి అమలులో ఉన్నాయా లేదా అనేది పరిశీలించడం, విద్యా విధానాలపై సలహా ఇవ్వడం, సవరించవలసిన చట్టపరమైన అంశాలను గుర్తించడం, విద్యా రంగంలో ప్రాధాన్యత కలిగిన అంశాలను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవడం, విద్యా ప్రాజెక్టులకు నిధులను సేకరించడం మరియు వాటిని సరైన విధంగా పంపిణీ చేయడం, విద్యా సంఘాల మధ్య సంబంధాలను మెరుగుపరచడం. ఈ విధులు విద్య కమిటి యొక్క లక్ష్యాలను సాధించడంలో కీలకంగా ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అన్ని మండలాల స్కూల్ కమిటి చైర్మన్, మండల, టౌన్ అధ్యక్షులు, మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.