కింగ్డమ్‌తో విజయ్ దేవరకొండ మాస్ రీ ఎంట్రీ

Vijay Deverakonda's pan-India film Kingdom releases on 29th. New wild poster goes viral, raising hopes of a strong comeback for the Rowdy hero. Vijay Deverakonda's pan-India film Kingdom releases on 29th. New wild poster goes viral, raising hopes of a strong comeback for the Rowdy hero.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ మాస్ మూడ్‌లోకి వచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం “కింగ్డమ్” పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయ్ మరో మాస్ అవతారంలో కనిపించబోతున్నారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రత్యేకంగా విజయ్ లుక్‌పై అభిమానుల్లో భారీగా హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో విజయ్ దేవరకొండ వైల్డ్ లుక్‌లో దర్శనమిచ్చారు. “కింగ్డమ్ మాసం పరిపాలించడానికి సిద్ధంగా ఉంది” అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌ను విడుదల చేయడం విశేషం. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ కొత్త లుక్ అభిమానుల అంచనాలను మరింత పెంచింది.

ఇటీవలి కాలంలో విజయ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో, ఆయన అభిమానులు “కింగ్డమ్” సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో విజయ్ ఫుల్ ఫామ్‌లోకి వస్తారని ఆశిస్తున్నారు. మాస్, యాక్షన్, ఎమోషన్ అన్నీ మిళితమైన కంటెంట్‌తో ఈ సినిమా విజయవంతమవుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *