Chandrahas Song Issue: ఏదో చేదాం అనుకుంటే..ఏదో అయింది చివరికి కాంట్రావెర్సీ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే నటుడు చంద్రహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “బరాబర్ ప్రేమిస్తా” “(Barabar Premistha)” తాజాగా వివాదంలో నిలిచింది.
ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ పాడిన ఓ పాటలో అసభ్య పదాలు ఉండటంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై చిత్ర నిర్మాతలు, దర్శకుడు తాజాగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.
నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. సినిమాలో తన పాత్రను వివరించే క్రమంలో చంద్రహాస్ పాట పాడాడని, అయితే అందులో అనుకోకుండా చిన్న పొరపాటు జరిగిందని తెలిపారు. వేదికపై ఉన్న ఎవరికీ ఆ సమయంలో ఆ విషయం తెలియలేదని, కావాలని చేసిన పని కాదని స్పష్టం చేశారు.
ఆ పాట పాడిన తర్వాత చంద్రహాస్(Chandrahas)కు కూడా అలా చేయకూడదని సూచించామని చెప్పారు. ఈ ఘటనపై తాము బాధ వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు.
దర్శకుడు సంపత్ రుద్ర కూడా స్పందిస్తూ, ఈ సంఘటన పట్ల చంద్రహాస్ చాలా బాధపడుతున్నాడని తెలిపారు. సినిమాలో ఎక్కడా అసభ్య పదాలు ఉన్న పాటలు లేవని, ప్రేక్షకులు అపోహలు పెట్టుకోనవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా, ఆ సమయంలో వేదికపై ఉన్న జేడీ చక్రవర్తి స్పందించలేదంటూ ట్రోల్స్ రావడంతో ఆయన కూడా వివరణ ఇచ్చారు. ప్రమోషన్లు కొత్తగా చేయడం తప్పు కాదని, కానీ అవి మహిళలను కించపరిచేలా ఉండకూడదని అన్నారు. ఆ రోజు తాను వెళ్లిపోవాల్సిందని కూడా వ్యాఖ్యానించారు.
