IFFI Goa:గోవాలో జరుగుతున్న వేవ్స్ ఫిల్మ్ బజార్ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)( IFFI) ఇనాగరేషన్ కార్యక్రమంలో దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ సభ్యురాలు జేవన్ కిమ్ అందరినీ ఆకట్టుకున్నారు. వేదికపై నిలబడి ఆమె “వందేమాతరం”(Vandemataram) ఆలపించిన విధానం ప్రేక్షకులను దేశవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను గెలుచుకుంది.
విదేశీయురాలు భారత జాతీయ గీతాన్ని ఈ స్థాయి డెడికేషన్‌తో పాడటమే ఆ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఆమె ఆలపనకు హాజరైనవారు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వగా, సోషల్ మీడియాల్లో ఆ వీడియో వేగంగా వైరల్ అవుతోంది.
జేవన్ కిమ్ గాత్రంలో వందేమాతరం వినగానే గూస్ బంప్స్ వచ్చాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భారతీయ సంస్కృతిపై ఆమె చూపించిన గౌరవానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన IFFI వేదికపై ఇండియా–కొరియా సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసిన క్షణంగా భావిస్తున్నారు.
ALSO READ:గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్… మరో రెండు విదేశీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభం
