పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని గుజ్జువాయి గ్రామంలో యన్.డి.ఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయినా సందర్భంగా “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు.
కురుపాం ఎమ్మెల్యే తోయక జగదిశ్వరి ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఇచ్చారు.
ముందుగా ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో పాల్గొని, పత్తి పంటకు సంబంధించి రైతులకు సూచనలు మరియు సలహాలు ఇచ్చారు.
అనంతరం, గుజ్జువాయి రిజర్వాయర్ ను సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు, వారి సమస్యలు తెలుసుకున్నారు.
గుజ్జువాయి సమీపంలో ఉన్న రిజర్వాయర్ ద్వారా సాగునీరు వృధాగా పోవడంతో, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు రైతులు తెలియజేశారు.
వెంటనే రిజర్వాయర్ మరమ్మతు పనులు చేపట్టే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా, ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించడంతో పాటు కరపత్రాలను అందజేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు అమలు చేయడం కూటమి ప్రభుత్వం ద్వారా సాధ్యమని ఎమ్మెల్యే జగదీశ్వరి పేర్కొన్నారు.