Telangana MLAs Disqualification:అనర్హత వేటు భయంతో రాజీనామా యోచనలో దానం, కడియం.?

Dhanam Nagender and Kadiyam Srihari considering resignation amid disqualification threat in Telangana Dhanam Nagender and Kadiyam Srihari considering resignation amid disqualification threat in Telangana

Telangana MLAs Disqualification: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్(Dhanam Nagender), కడియం శ్రీహరి(Kadiyam Srihari) అనర్హత తప్పించుకునేందుకు ముందుగానే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చల కోసం దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు(Disqualification Case) వేయాలని కేటీఆర్ సహా పలువురు నేతలు స్పీకర్‌కు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

also read:New Labour Codes India | పాత కార్మిక చట్టాల వల్ల లాభం లేదు..కొత్త లేబర్ కోడ్స్‌ అమల్లోకి

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ విచారణను వేగవంతం చేస్తూ ఈ నెల 23లోగా వివరణ ఇవ్వాలని దానం, కడియంలకు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో దానం ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం పార్టీలో మార్పు స్పష్టమవ్వడంతో అనర్హత తప్పదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజీనామా చేస్తే రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ సీటుతో పాటు మంత్రి పదవి, లేక ఖైరతాబాద్ ఉపఎన్నికలో టికెట్ వంటి ప్రతిపాదనలు అధిష్ఠానం ముందు ఉంచినట్లు ప్రచారం ఉంది. కడియం శ్రీహరి కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. తన కుమార్తె కావ్యకు బహిరంగ మద్దతు ఇవ్వడం, నామినేషన్ పత్రాలపై సంతకం చేయడం ఆయనపై కేసును బలపరిచాయి.

స్పీకర్‌ను కలిసి మరింత గడువు కోరిన ఆయన, అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దానం వెంటనే రాజీనామా చేస్తారని, కడియం కూడా అదే బాటలో నడిచే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *