Team India Language Controversy: వడోదర వేదికగా టీమిండియా–న్యూజిలాండ్(IND VS NEWZ) మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భాషా అంశం చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్(KL RAHUL), స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు అతని మాతృభాష అయిన తమిళంలో సూచనలు ఇవ్వడం స్టంప్ మైక్‌లో రికార్డయ్యింది. వేగంగా బంతులు వేస్తున్న సుందర్‌ను నెమ్మదిగా బౌలింగ్ చేయాలని రాహుల్ తమిళంలో చెప్పాడు.
ఈ ఘటనపై స్పందించిన కామెంటేటర్ వరుణ్ ఆరోన్, ఆటగాడికి విషయం స్పష్టంగా అర్థమయ్యేలా రాహుల్ తమిళంలో మాట్లాడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ చర్చలోకి మరో కామెంటేటర్, మాజీ టీమిండియా కోచ్ సంజయ్ బంగర్ జోక్యం చేసుకుని తాను ‘జాతీయ భాష’కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వ్యక్తమైంది. భారత రాజ్యాంగం ప్రకారం దేశానికి ప్రత్యేకంగా జాతీయ భాష అనేదే లేదని, హిందీ మరియు ఇంగ్లిష్‌లు కేవలం అధికార భాషలుగా మాత్రమే గుర్తింపు పొందాయని నెటిజన్లు స్పష్టం చేశారు.
ALSO READ:kakinada fire accident | కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..38 పూరిళ్లు ?
మ్యాచ్ విషయానికొస్తే, 301 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 93 పరుగులతో మెరిసిపోగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 56 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉండగా, సైడ్ స్ట్రెయిన్ గాయంతో వాషింగ్టన్ సుందర్ మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆయుష్ బదోని జట్టులోకి ఎంపికయ్యాడు.
