తరుణం’ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్

Romantic thriller "Tarunam" set to stream on Tentkotta from April 25. The crime-suspense angle is expected to attract youth audiences on OTT. Romantic thriller "Tarunam" set to stream on Tentkotta from April 25. The crime-suspense angle is expected to attract youth audiences on OTT.

కిషన్ దాస్, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘తరుణం’ జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పుగళ్ నిర్మించాడు. థియేటర్లలో ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, కంటెంట్ పరంగా ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

‘తరుణం’ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘టెంట్ కొట్ట’ సొంతం చేసుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమాను తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. థియేటర్ల విడుదల తర్వాత కొంత గ్యాప్ తర్వాత ఓటీటీలోకి రానున్న ఈ చిత్రం, క్రైమ్-సస్పెన్స్ నేపథ్యంలో సాగుతూ యువతను ఆకర్షించేలా ఉన్నట్టు సినీ వర్గాల టాక్.

ఈ సినిమాలో దర్బుక శివ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్రైమ్, సస్పెన్స్, ప్రేమ అనే మూడు ఎలిమెంట్ల మేళవింపుతో కథ నడవడం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. థ్రిల్లర్ లవ్ స్టోరీల పట్ల ఆసక్తి ఉన్నవారికి ‘తరుణం’ ఓ మంచి ఎంపిక అవుతుందని భావిస్తున్నారు.

కథ విషయానికి వస్తే – అర్జున్, మీరా అనే ఇద్దరూ ఒక పెళ్లిలో కలుసుకుంటారు. వారి మధ్య అభిమానం పెరిగి, ప్రేమగా మారుతుంది. అయితే ఒక రోజు మీరా ఇంటికి వెళ్లిన అర్జున్, అక్కడి కిచెన్‌లో ఒక శవాన్ని చూస్తాడు. ఆ శవాన్ని మాయం చేయాలని మీరా అతనిని అడుగుతుంది. ఆ శవం ఎవరిది? ఎందుకు అక్కడ ఉంది? ఈ సంఘటనల వల్ల వారిద్దరూ ఎదుర్కొనే పరిణామాలే కథానాయకాంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *