హైకోర్టులో క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ : Hydra Commissioner
Hydra Commissioner: బతుకమ్మకుంట వివాదంలో కోర్టు ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు వచ్చి క్షమాపణ తెలిపారు. ఈ కేసులో ఎ.సుధాకర్‌రెడ్డి హైడ్రాపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా, జూన్ 12న జారీ చేసిన యథాతథస్థితి ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలు వెలిశాయి. అయితే ఈ పిటిషన్‌పై అక్టోబర్ 31న విచారణ జరిపిన హైకోర్టు, రంగనాథ్ వ్యక్తిగత హాజరుతో వివరణ ఇవ్వాలని నవంబర్ 27న ఆదేశించింది. అయితే అత్యవసర పనుల కారణంగా హాజరుకాలేకపోతున్నానని…
