NIA కార్యాలయం సమీపంలో చైనా రైఫిల్ స్కోప్ లభ్యం..అప్రమత్తమైన భద్రతా దళాలు
Rifle Scope: జమ్మూకశ్మీర్లో భద్రతా వర్గాల్లో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రాంతీయ కార్యాలయానికి సమీపంలోని సిద్రా ప్రాంతంలో చైనా తయారీ శక్తివంతమైన రైఫిల్ టెలిస్కోప్ (scope) లభ్యమైంది. ఈ ఘటన భద్రతా దళాలను పూర్తిగా అప్రమత్తం చేసింది. జమ్మూ జిల్లా శివార్లలోని సిద్రా ప్రాంతంలోని అస్రారాబాద్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఈ వస్తువు బయటపడింది. చిన్నారి దానిని బొమ్మగా భావించి ఆడుతుండగా గ్రామస్థులు గమనించి, అది…
