ఉపాసన, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్యక్రమంలో మహిళలకు హెల్త్ కేర్ రంగంలో వ్యాపార సాయం అందించనున్నట్టు తెలిపారు. కో-ఫౌండర్‌గా సహాయం చేయడానికి యువ మహిళలు ముందుకు రావాలని పిలుపు.

మహిళలకు వ్యాపార సాయం అందిస్తానని అపోలో హాస్పిటల్స్ ఎండీ ఉపాసన ప్రకటించారు

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తనవంతుగా సాయం చేస్తానని హీరో రాంచరణ్ శ్రీమతి, అపోలో హాస్పిటల్స్ ఎండీ ఉపాసన పేర్కొన్నారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొని మాట్లాడారు. హెల్త్ కేర్ రంగంలో మహిళలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వారు చేపట్టబోయే వ్యాపారానికి కో ఫౌండర్ గా ఉండడంతో పాటు అవసరమైన సాయం అందిస్తానని చెప్పారు. తనతో కలిసి వ్యాపారం చేయడానికి ఔత్సాహిక యువ మహిళలు ముందుకు రావాలని కోరారు. భారతదేశంలో హెల్త్…

Read More
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలలో జానీ మాస్టర్ 2034లో జ‌న‌సేనాని ప్రధానిగా కూర్చొంటారని చెప్పారు. అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. 'గబ్బర్ సింగ్' మూవీ రీ-రిలీజ్ కూడా సంబరంగా జరిగింది.

ప‌వ‌న్ కళ్యాణ్ పుట్టిన రోజున జానీ మాస్ట‌ర్ పెద్ద ప్రకటన

సోమ‌వారం జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో అభిమానులు భారీ ఎత్తున వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఒక‌చోట వేడుక‌ల్లో పాల్గొన్న జ‌న‌సేన నేత‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 2034లో జ‌న‌సేనాని ప్ర‌ధాని అవుతార‌ని చెప్పుకొచ్చారు.  జానీ మాస్ట‌ర్ మాట్లాడుతూ.. “ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. 2029లో ముఖ్య‌మంత్రి అవుతారు. అలాగే 2034లో ప్ర‌ధాన‌మంత్రి అవుతారు. ఇది రాసుకోండి. జై జ‌న‌సేన” అని అన్నారు. జానీ…

Read More
అమీన్ పూర్ మండలంలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. నిర్మాణాలు కూల్చి, సరిహద్దు రాళ్లను తొలగించారు. స్కూల్ యాజమాన్యం ఆక్రమించిన 15 గుంటలు కూడా కూల్చివేశారు.

అమీన్ పూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగింపు

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం 20 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన నిర్మించిన కట్టడాలను కూల్చేస్తూ, సరిహద్దు రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. సర్వే నంబర్‌ 119లో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన ప్లాట్లను తొలగించారు. ఈ భూమిలో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గుంటలు ఆక్రమించినట్లు…

Read More
గుజరాత్ తీరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన హెలికాప్టర్‌ పైలట్ల కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక డైవర్ రక్షించగా, మరో డైవర్, ఇద్దరు పైలట్ల కోసం 4 నౌకలు, 2 విమానాలతో గాలింపు.

గుజరాత్ తీరంలో హెలికాప్టర్ గల్లంతు

సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత గల్లంతైన ఇద్దరు హెలికాప్టర్ పైలట్లు, ఒక డైవర్ కోసం భారత తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్‌గార్డ్) పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. నలుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లతో వెళ్తున్న హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో గత రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది.  హెలికాప్టర్.. నౌకను సమీపిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు కోస్ట్‌గార్డు అధికారులు తెలిపారు. గల్లంతైన ఇద్దరు డైవర్లలో ఒకరిని రక్షించామని, మరో డైవర్, ఇద్దరు పైలట్ల కోసం…

Read More
తెలంగాణలో కురిసిన వర్షాల కారణంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ హౌజ్ లోకి వరద నీరు చేరింది. రూ. 10 కోట్లు నష్టం, అంచనా వేయడం కొనసాగుతోంది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వరద నష్టం

తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు వరద ముంచెత్తింది. అండర్ టన్నెల్ లోకి వరద నీరు చేరింది. వెంకటాద్రి పంప్ హౌజ్ నీట మునిగింది. కీలకమైన మెషిన్లలోకి నీరు చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా రూ.10 కోట్ల వరకు నష్టం ఏర్పడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వరద నీటిని బయటకు ఎత్తిపోస్తున్నామని వివరించారు. పంప్ హౌజ్ లో నుంచి నీటిని పూర్తిగా బయటకు పంపాకే నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేయొచ్చని తెలిపారు. రాష్ట్ర…

Read More
ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. ప్రతి రాష్ట్రానికి రూ. 50 లక్షలు.

ఎన్టీఆర్ వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం

భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాలు అత‌లాకుత‌లం అయ్యాయి. జన‌జీవనం అస్త‌వ్య‌స్తంగా మారింది. ఇప్ప‌టికే ఇరు రాష్ట్రాలు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు ప్ర‌ముఖులు వ‌ర‌ద బాధితుల‌కు త‌మవంతు సాయం చేందుకు ముందుకు వ‌స్తున్నారు.  మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వనీద‌త్ విరాళాలు ప్ర‌క‌టించారు. తాజాగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల‌కు విరాళం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ‘ఎక్స్’…

Read More
తెలుగు రాష్ట్రాల్లో భయకంపితమైన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు మాలెగావ్‌లో దోపిడీ చేసింది. 70 గ్రాముల బంగారం, అరటిపండ్లతో పాటు ఇంటిలో చొరబడారు. సీసీటీవీలో రికార్డు.

చెడ్డీగ్యాంగ్ మాలెగావ్‌లో దొంగతనం

నిన్నమొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలను భయకంపితులను చేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు మహారాష్ట్రలో వాలింది. నాసిక్‌లోని మాలెగావ్‌లో ఓ ఇంటితోపాటు కాలేజీలోకి చొరబడిన దొంగలు  రూ. 5 లక్షల విలువైన 70 గ్రాముల బంగారంతోపాటు అరటిపండ్లను ఎత్తుకెళ్లారు. చెడ్డీ, బనియన్ ధరించిన దొంగలు ఆవరణలోకి ప్రవేశించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.  మాలెగావ్‌లో నిన్నమొన్నటి వరకు ‘గౌన్‌గ్యాంగ్’ హల్‌చల్ చేయగా, ఇప్పుడు చెడ్డీగ్యాంగ్ రంగంలోకి దిగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గౌన్‌గ్యాంగ్ సభ్యులు మహిళల గౌన్లు ధరించి…

Read More