Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఎన్టీఆర్ వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం

ఎన్టీఆర్ వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం

-

Chat on WhatsApp

భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌ల‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాలు అత‌లాకుత‌లం అయ్యాయి. జన‌జీవనం అస్త‌వ్య‌స్తంగా మారింది. ఇప్ప‌టికే ఇరు రాష్ట్రాలు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు ప్ర‌ముఖులు వ‌ర‌ద బాధితుల‌కు త‌మవంతు సాయం చేందుకు ముందుకు వ‌స్తున్నారు. 

మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వనీద‌త్ విరాళాలు ప్ర‌క‌టించారు. తాజాగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల‌కు విరాళం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయన ఒక పోస్ట్ పెట్టారు.  

Pin page

“రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద బీభ‌త్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. 

వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ. 50 ల‌క్ష‌లు విరాళంగా ప్రకటిస్తున్నాను” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp