జమ్మూ కాశ్మీర్లో హై అలెర్ట్…..సీసీటీవీ కెమెరాలో చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది
Jammu Kashmir High Alert: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. స్థానిక మార్కెట్ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరా(cc camera)లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(lashkar-e-taiba)కు సంబంధించిన ఉగ్రవాదులు కనిపించడంతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించాయి. డిసెంబర్ 25న సాయంత్రం 6:12 గంటల సమయంలో ఈ ఫుటేజ్ రికార్డయినట్లు అధికారులు వెల్లడించారు. సీసీటీవీ వీడియోలో కనిపించిన వ్యక్తుల్లో ఒకరిని కుల్గాం జిల్లా ఖేర్వాన్‌కు చెందిన మహ్మద్ లతీఫ్ భట్‌గా…
