విజయనగరం జిల్లా మెంటాడ మండలం, కైలాం గ్రామంలో గురువారం మెంటాడ మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి ఇంటింటి సర్వే నిర్వహించి విద్యార్థులు తక్కువగా ఉండడానికి గల కారణాలను వెలికి తీయాలని ఆదేశించారు. అలాగే గ్రామంలో ఉన్న వెల్ నెస్ సెంటర్ ను తనిఖీ చేశారు. ఓపి అధికంగా ఉండడం పట్ల వైద్యసేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని రేషన్ డిపో తెరవకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొందరు అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు కాకపోవడంతో వారికి అధికారులు మంజూరు అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట తహసిల్దార్ కోరాడ వెంకటరావు, ఎంపీడీవో త్రివిక్రమ రావు, ఎంపీటీసీ చప్ప సూర్య కుమారి, పంచాయతీ అధికారి విమల కుమారి,జనసేన పార్టీ అధ్యక్షుడు సబ్బవరపు రాజశేఖర్ ,టిడిపి నాయకులు కొరుపిల్లి చిన్నం నాయుడు, గ్రామ సీనియర్ నాయకులు గండి సింహాద్రి, హౌసింగ్ ఏఈ డేవిడ్, ఏపిఎం సత్యనారాయణ, ఏ పీ ఓ చిన్నప్పయ్య, ఎంఈఓ వర్మ, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మెంటాడ మండల ప్రత్యేక అధికారి గ్రామంలో పర్యటన
