గద్వాల పట్టణంలో చిన్న అగ్రహారం దగ్గర ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ పైన ఉన్న బిల్డింగ్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు మేలు అగిరాయి. మంటలు ఎగిసిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. పెద్ద మంటలు చెలరేగుతుండటంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి.
ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న ఫైర్ ఇంజన్ పలు వాహనాలతో ఘటన స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ మంటలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. అదృష్టవశాత్తు, ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోయినప్పటికీ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మిగిలిన సమాచారాన్ని అధికారులు ప్రకటించాలని తెలియజేశారు.