Telangana Vision 2047: రేవంత్ విజన్ 2047తో అభివృద్ధి ప్లాన్ 

Revanth Reddy Revanth Reddy

Telangana Vision 2047: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధి శిఖరాలకు చేర్చే లక్ష్యంతో క్యూర్, ప్యూర్, రేర్(Cure–Pure–Rare) అనే మూడు ఆర్థిక జోన్ల మోడల్‌ను ప్రకటించారు.

ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో ISB, నీతి ఆయోగ్‌తో పాటు లక్షలాది మంది ప్రజల సూచనలు తీసుకున్నారు.

హైదరాబాద్  (ఓఆర్ఆర్)  లోపలి భాగం క్యూర్ జోన్‌గా గుర్తించబడగా, కాలుష్యం లేని నెట్-జీరో సర్వీస్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ORR నుంచి RRR వరకు ఉన్న ప్రాంతాన్ని ప్యూర్ జోన్‌గా పేర్కొని, బుల్లెట్ ట్రైన్, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, కొత్త విమానాశ్రయాలు వంటి మెగా ప్రాజెక్టులను ప్రవేశపెట్టారు.

ALSO READ:A1TV తెలుగు & A1 FLASH News లో ట్రైనీ ఉద్యోగాలు!

RRR వెలుపలి గ్రామీణ ప్రాంతాలను రేర్ జోన్‌గా నిర్ణయించి, రైతులకు అధిక ఆదాయం, విత్తన ఉత్పత్తి, ఆహార భద్రత వంటి లక్ష్యాలను నిర్ధారించారు.

2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను మార్చి, దేశ GDPలో రాష్ట్ర వాటాను 10%కు చేరుస్తామని సీఎం తెలిపారు. ఈ మూడు జోన్లు సమానంగా అభివృద్ధి చెందితేనే ఈ లక్ష్యాలు సాధ్యమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *