Republic Day Terror: రిపబ్లిక్ డేకు ముందు దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు రూపొందించిన కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు చేపట్టిన ప్రత్యేక గాలింపు చర్యల్లో, “ఖలిస్థానీ ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన మాడ్యూల్‌ను పంజాబ్‌లో పట్టుకున్నారు”.
ఈ ఘటనలో “ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 2.5 కిలోల RDXతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన నిందితులను “శరణ్‌ప్రీత్ సింగ్, దిల్జోత్ సింగ్ సైని, హర్మాన్, అజయ్, అర్ష్‌దీప్ సింగ్”లుగా అధికారులు గుర్తించారు. జనవరి 26న నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనే ఉద్దేశంతో వీరు కుట్ర పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఉగ్ర ముఠాను అమెరికాలో ఉన్న బబ్బర్ ఖల్సా హ్యాండ్లర్లు నియంత్రిస్తున్నారని, వారి ఆదేశాల మేరకు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో “దేశ రాజధాని దిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు”.
గతంలో ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రదాడిని దృష్టిలో ఉంచుకుని గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
also read:Top 4 Unbreakable Records in ODI Cricket | వన్డే ఇంటర్నేషనల్స్‌లో బ్రేక్ కాని 4 రికార్డులు
