Ghaziabad murder | రెంట్ అడిగేందుకు వెళ్లిన ఇంటి యజమానురాలిని దారుణ హ**

Police investigating landlord murder case in Ghaziabad apartment society Police investigating landlord murder case in Ghaziabad apartment society

Ghaziabad murder: ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లో అద్దె అడిగేందుకు వెళ్లిన ఇంటి ఓనరు దారుణ హ**త్య*కు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఓరా కైమోరా సొసైటీలో నివసిస్తున్న దీపశిఖ శర్మ(Deepashika sharma) కుటుంబానికి రెండు ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం. 

ఒక ఫ్లాట్‌లో ఆమె కుటుంబంతో నివసిస్తుండగా, మరో ఫ్లాట్‌ను ఆకృతి, అజయ్ అనే దంపతులకు రెంటుకి ఇచ్చింది. అలాగే నాలుగు నెలలుగా రెంట్ కట్టకపోవడంతో నిన్న (బుధవారం) సాయంత్రం రెంటుకు ఉన్న ఫ్లాట్‌కు వెళ్ళింది.
 
నిన్న అనగ  వెళ్లిన ఆమె రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇదే సమయంలో పనిమనిషికి అనుమానం వచ్చి ఆ ఫ్లాట్‌కు వెళ్లి చూడగా, దీపశిఖ శర్మ మృతదేహం రక్తపు మడుగులో సూట్‌కేసులో కుక్కబడి ఉండటాన్ని గుర్తించింది. వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించింది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులైన ఆకృతి, అజయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అద్దె చెల్లింపులపై తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

మృ*త*దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో సొసైటీలో భయాందోళనలు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *