నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పాపులారిటీ ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అల్లు అర్జున్‌తో కలిసి నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించడమే కాకుండా, జపాన్‌లో(Pushpa 2 ) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అక్కడ ‘పుష్ప క్రునిన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది.
సినిమా ప్రచార కార్యక్రమాల నిమిత్తం జపాన్(Japan) వెళ్లిన రష్మికకు అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు. తాను అక్కడ ఎదుర్కొన్న అపూర్వమైన ప్రేమను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
జపాన్‌లో కేవలం ఒక్క రోజు మాత్రమే గడిపినప్పటికీ, ఆ సమయంలో లభించిన ప్రేమ తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని పేర్కొంది.
ALSO READ:Rajasthan Collector | పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే నా లక్ష్యం.. అంతవరకు జీతం తీసుకోను
అక్కడి అభిమానులు ఇచ్చిన ప్రేమలేఖలు, అందమైన బహుమతులు తనను ఎంతో భావోద్వేగానికి గురి చేశాయని రష్మిక వెల్లడించింది. వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపింది. అంతేకాదు, త్వరలో మళ్లీ జపాన్ రావాలని, ఈసారి ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నానని చెప్పింది. అలాగే జపనీస్ భాష నేర్చుకుంటానని కూడా హామీ ఇచ్చింది.
ప్రస్తుతం ‘మైసా’(MAISA) వంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న రష్మిక చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
