Wednesday, August 5, 2026
Chat on WhatsApp
HomeFilms NewsRashmika Mandanna Japan | జపాన్ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన నేషనల్ క్రష్..ఎమోషనల్ పోస్ట్ 

Rashmika Mandanna Japan | జపాన్ అభిమానుల ప్రేమకు ఫిదా అయిన నేషనల్ క్రష్..ఎమోషనల్ పోస్ట్ 

-

Chat on WhatsApp

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) పాపులారిటీ ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అల్లు అర్జున్‌తో కలిసి నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించడమే కాకుండా, జపాన్‌లో(Pushpa 2 ) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అక్కడ ‘పుష్ప క్రునిన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది.

సినిమా ప్రచార కార్యక్రమాల నిమిత్తం జపాన్(Japan) వెళ్లిన రష్మికకు అక్కడి అభిమానులు ఘన స్వాగతం పలికారు. తాను అక్కడ ఎదుర్కొన్న అపూర్వమైన ప్రేమను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

జపాన్‌లో కేవలం ఒక్క రోజు మాత్రమే గడిపినప్పటికీ, ఆ సమయంలో లభించిన ప్రేమ తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని పేర్కొంది.

ALSO READ:Rajasthan Collector | పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే నా లక్ష్యం.. అంతవరకు జీతం తీసుకోను 

అక్కడి అభిమానులు ఇచ్చిన ప్రేమలేఖలు, అందమైన బహుమతులు తనను ఎంతో భావోద్వేగానికి గురి చేశాయని రష్మిక వెల్లడించింది. వాటిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపింది. అంతేకాదు, త్వరలో మళ్లీ జపాన్ రావాలని, ఈసారి ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నానని చెప్పింది. అలాగే జపనీస్ భాష నేర్చుకుంటానని కూడా హామీ ఇచ్చింది.

ప్రస్తుతం ‘మైసా’(MAISA) వంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న రష్మిక చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp