Quick Commerce | 10 నిమిషాల డెలివరీకి బ్రేక్?.. క్విక్ కామర్స్ సంస్థల కీలక నిర్ణయం

quick commerce 10 minute delivery ban india quick commerce 10 minute delivery ban india

Quick Commerce: క్విక్ కామర్స్ సేవలకు సంబంధించి దేశవ్యాప్తంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పది నిమిషాల్లో డెలివరీ(10-Minute Delivery ) అనే నిబంధనను నిలిపివేయడానికి  క్విక్ కామర్స్ సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మిగతా సంస్థలు కూడా ఇదే దారిలో అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది.  

ALSO READ:రూ.15,999కే 5G ఫోన్?.. Poco M8 5G సేల్ స్టార్ట్!

గిగ్ కార్మికుల(Gig Worker) భద్రత, రక్షణ, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలు డిమాండ్లతో గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, బ్లింకిట్‌, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సహా పలు క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు.

ఈ సమావేశాల్లో పది నిమిషాల డెలివరీ నిబంధనను తొలగించేందుకు ఆయా సంస్థలు అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో బ్లింకిట్ ఇప్పటికే తన బ్రాండింగ్‌లో ‘10 నిమిషాల డెలివరీ’ హామీని తొలగించినట్లు తెలుస్తోంది.

క్విక్ డెలివరీ వ్యవస్థపై పార్లమెంట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా ఇటీవల ప్రశ్నలు లేవనెత్తారు. ఈ విధానం గిగ్ కార్మికులపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోందని, డెడ్‌లైన్‌ను అందుకునే క్రమంలో వారి భద్రత ప్రమాదంలో పడుతోందని విమర్శించారు.

ఈ తరహా డెలివరీ విధానాలను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *