మెదక్ జిల్లా చిన్న శంకరం పేట వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ ను మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్ కు తరలించారు. మెదక్ జిల్లాలో రెండు హత్యలు రాష్ట వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దారుణ హత్యకు గురైన ఇద్దరు వ్యక్తులను హత్య చేసింది ఒకే వ్యక్తి, చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఒట్టే మల్లేశం అలియాస్ (గొల్ల మల్లేష్). అక్టోబర్ 24వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద హత్యకు గురైన వ్యక్తి కామారెడ్డి జిల్లా పోసానిపేట గ్రామానికి చెందిన గాజుల నవీన్ (24) గా గుర్తించారు. ఈ నెల 3వ తేదీన పద్మరాయుని గుట్ట బస్టాండ్ లో హత్యకు గురైన వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి వడ్డెర కాలనీకి చెందిన కొమ్రే స్వామి (39) లను హత్యలు చేసి వారి వద్ద ఉన్న బంగారు వస్తువులను తీసుకుని తన అన్న ఒట్టే0 రమేష్ కు అలియాస్ గొల్ల రమేష్ కు ఇచ్చేవాడు.
ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ రిమాండ్ కు తరలించారు అనంతరం మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఇద్దరినీ మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నుండి తీసుకువచ్చి మద్యం తాగించి శంకరంపేటలో ఇద్దరు వ్యక్తులను హత్య చేసి ఒకే తరహాలో బండరాయితో కొట్టి, మృతదేహాలను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. మద్యం మత్తులో డబ్బులు, విలువైన వస్తువుల కోసం వ్యక్తులను హత్యచేస్తున్న సైకో కిల్లర్ ఈ రెండు హత్యలే కాకుండా అక్టోబరు 31వ తేదీన రైల్వే ఉద్యోగి కావలి రమేష్ పై దాడి. మల్కాజ్ గిరి జిల్లా హనుమాన్ నగర్ కాలనీకి చెందిన వ్యక్తి గా గుర్తించారు. రైల్లో కామారెడ్డికి వెళ్తుండగా మల్లేష్ అతని తలపై సుత్తితో కొట్టి అతని మెడలో నుంచి బంగారు గొలుసు, వెండి ఉంగరాలు, బ్రాస్ లెట్ దొంగిలించాడు. తీవ్రంగా గాయపడ్డ రమేష్ ప్రస్తుతం హైద్రాబాద్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఎస్పీ తెలిపారు.
2013 సంవత్సరంలో శంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి నరసయ్య అనే వ్యక్తిని హత్య చేసి పది సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు. 2017 సంవత్సరంలో సెంట్రల్ జైల్లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మహిళను వేధించగా పిర్యాదు చేయడంతో విషయాన్ని మనసులో పెట్టుకొని 2019 లో ఆమె నివాసం ఉంటున్న నేతాజీ నగర్ లో వారి ఇంట్లో ప్రవేశించి వారి వరండాలో వాషింగ్ మిషన్, మరియు మెయిన్ డోర్ వస్తువులు తగలబెట్టాడు.
2022 నుంచి కాచిగూడ నుండి నిజామాబాద్ కు వెళ్లే రైలో అటు ఇటు తిరుగుతూ దొంగతనాలు చేస్తూ రైల్వే ప్లాట్ ఫామ్ పై నివాసం ఉంటూ సైకో కిల్లర్ ఒంటరిగా ఉన్న వారిని పరిచయం చేసుకొని వారితో స్నేహం చేసి మద్యం తాగించి అకారణంగా హత్యలు చేశడానియన్నారు. నిజమా బాద్ నుంచి చర్లపల్లి కి రైల్ లో తిరుగుతూ హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ నుండి ఒక గోల్డ్ రింగ్,ఒక గోల్డ్ చైన్,5 ఫోన్లు,ఒక ల్యాప్ టాప్,ఒక సుత్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి, రామాయంపేట సి ఐ వెంకటరాజా గౌడ్, చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్, రామాయంపేట ఎస్సై బాలరాజు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
