ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో, పాత కక్షల కారణంగా ఒక దారుణ ఘటన జరిగింది. కొత్తపేట-నాగోల్ ప్రధాన రహదారి మోహన్ నగర్ లోని వైన్స్ వద్ద మద్యం సేవిస్తున్న వారిపై కత్తులతో దాడి జరిగింది. ఈ దాడి వల్ల నాగరాజు, రాము అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాయపడిన వారిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
ఈ ఘటనలో గాయపడ్డ వారిలో ఒకరు మృతి చెందారు. 2022లో, పురుషోత్తం పెళ్లి ఊరేగింపులో జరిగిన గొడవలో బొడ్డు మహేష్, పురుషోత్తం పై బీరు సీసాతో దాడి చేయడం జరిగింది. ఈ కేసు కోర్టులో ఉన్నప్పుడు, ఇరువురు కాంప్రమైజ్ చేసుకున్నారు. అయితే, బొడ్డు రమేష్ కోర్టుకు హాజరుకాకపోవడంతో, ఆయన వైన్ షాప్ దగ్గర ఉన్న సమయంలో వైన్స్ వద్ద ఉన్న వారిపై దాడి చేశారు.
ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలు, ఆందోళనలు, వ్యక్తిగత వివాదాల కారణంగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.