Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeRangareddyLal Bahadur Nagaపాత కక్షల కారణంగా కత్తులతో దాడి, ఒకరు మృతి

పాత కక్షల కారణంగా కత్తులతో దాడి, ఒకరు మృతి

-

Chat on WhatsApp

ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో, పాత కక్షల కారణంగా ఒక దారుణ ఘటన జరిగింది. కొత్తపేట-నాగోల్ ప్రధాన రహదారి మోహన్ నగర్ లోని వైన్స్ వద్ద మద్యం సేవిస్తున్న వారిపై కత్తులతో దాడి జరిగింది. ఈ దాడి వల్ల నాగరాజు, రాము అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాయపడిన వారిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.

ఈ ఘటనలో గాయపడ్డ వారిలో ఒకరు మృతి చెందారు. 2022లో, పురుషోత్తం పెళ్లి ఊరేగింపులో జరిగిన గొడవలో బొడ్డు మహేష్, పురుషోత్తం పై బీరు సీసాతో దాడి చేయడం జరిగింది. ఈ కేసు కోర్టులో ఉన్నప్పుడు, ఇరువురు కాంప్రమైజ్ చేసుకున్నారు. అయితే, బొడ్డు రమేష్ కోర్టుకు హాజరుకాకపోవడంతో, ఆయన వైన్ షాప్ దగ్గర ఉన్న సమయంలో వైన్స్ వద్ద ఉన్న వారిపై దాడి చేశారు.

ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలు, ఆందోళనలు, వ్యక్తిగత వివాదాల కారణంగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp