Narasimha 4K Re-Release: రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్‌గా ‘నరసింహ’ మళ్లీ థియేటర్లలో 

Rajinikanth Padayappa Narasimha 4K re-release poster celebration Rajinikanth Padayappa Narasimha 4K re-release poster celebration

Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్‌గా ‘నరసింహ’ మళ్లీ థియేటర్లలోకి వచ్చి సందడి చేయనుంది. భారతీయ సినిమా రంగంలో అరుదైన మైలురాయి చేరుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా అభిమానులకు ప్రత్యేక బహుమతి అందిస్తున్నారు.

ఆయన కెరీర్‌లో అతిపెద్ద క్లాసిక్‌గా నిలిచిన ‘పడయప్ప’(Padayappa) (తెలుగులో ‘నరసింహ’)(Telugu: Narasimha) సినిమాను డిసెంబర్ 12న 4K ఫార్మట్‌లో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేయనున్నారు.

ALSO READ:AP women loan scheme: ఏపీ మహిళలకు సర్కార్ శుభవార్త | 48 గంటల్లో ఖాతాల్లో రూ.8 లక్షలు

1999లో విడుదలై బాక్సాఫీస్‌ను కుదిపిన ఈ చిత్రం రజనీ స్టైల్, రమ్యకృష్ణ నీలాంబరి పాత్ర, కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వంటి అంశాలతో పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజా రీ-రిలో కొత్త 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ప్రేక్షకులకు థియేటర్ అనుభూతిని కొత్త స్థాయిలో అందించేందుకు సిద్ధమవుతోంది.

రజనీకాంత్ అభిమాన వర్గాల్లో ఈ రీ-రిలీజ్ వేడుకల వాతావరణాన్ని సృష్టించగా, ఈ క్లాసిక్ మరోసారి రికార్డులు సృష్టిస్తుందా అన్న ఆసక్తి పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *