నటుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న జరగనుంది. ఈ వార్తను అక్కినేని కుటుంబ సభ్యులు ధృవీకరించడం తో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. అప్పటినుంచి వీరి వివాహ తేదీపై చర్చలు జరుగుతున్నాయి.
బుధవారం ఉదయం నుంచి వివాహ ముహూర్తంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతుండగా, కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. కొన్ని రోజుల క్రితం శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పసుపు పనులను మొదలుపెట్టినట్లు సూచిస్తూ కొన్ని ఫోటోలు పంచుకున్నారు, దాంతో అభిమానులు వివాహ వేడుకలను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు, డిసెంబర్‌లో వివాహం ఖరారు కావడంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.