పోలీస్ అమర వీరుల వారోత్సవాలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సైలు యాయాతి రాజు, సాయి కిషోర్ రెడ్డి లు పాల్గొన్నారు. దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ కరుణాకర్ మాట్లాడుతూ అమర వీరుల స్ఫూర్తితో ముందుకు సాగుతూ, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొనాలి.
వందలాది మంది రక్తదాతలు ఈ శిబిరానికి హాజరై రక్తదానం చేశారు. కార్యక్రమం విజయవంతంగా సాగింది. రక్తదానానికి భారీ స్పందన వచ్చినందుకు పోలీస్ అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అమర వీరుల జ్ఞాపకార్థంగా పోలీస్ శాఖ చేపట్టిన ఈ రక్తదాన కార్యక్రమం సమాజానికి మంచి సందేశాన్ని అందించింది,అన్నారు.
అశ్వారావుపేటలో రక్తదాన శిబిరం నిర్వహణ
