ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. డీసీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌తో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. రాహుల్ కీపింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ అతనితో కోపంగా ఏదో మాట్లాడిన దృశ్యం కెమెరాలకు చిక్కింది.
వివాదం తరువాత రాహుల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. అయితే ఈ గొడవకు గల అసలైన కారణం ఏమిటనేది బయటకు రాలేదు. అయితే, మ్యాచ్ ముగిసిన తరువాత కోహ్లీ స్వయంగా రాహుల్‌ను ఆలింగనం చేయగా, ఇద్దరూ నవ్వుతూ ఆ ఘటనను లైట్‌గా తీసుకున్నట్లు స్పష్టమైంది.
మ్యాచ్ విషయానికి వస్తే బెంగళూరు జట్టు అదిరిపోయే విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను మట్టికరిపించింది. విరాట్ కోహ్లీ మరోసారి అర్ధశతకం (51 పరుగులు)తో జట్టును గెలుపు దిశగా నడిపించాడు. కోహ్లీ బ్యాటింగ్‌లో తన క్లాస్ మరోసారి చూపించాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోహ్లీ 10 మ్యాచ్‌లు ఆడి, 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన కోహ్లీ ఇప్పటికే ఆరు అర్ధశతకాలు నమోదు చేశాడు. వరుసగా మంచి ఫార్మ్‌లో ఉన్న కోహ్లీ బెంగళూరు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాడు.