Kerala TRP scam: టీఆర్పీ రేటింగ్స్ కోసం రూ.100 కోట్ల లంచాలు ఇచ్చిన భారీ మోసం కేరళలో వెలుగులోకి వచ్చింది. మీడియా నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తే ఈ స్కామ్, దేశవ్యాప్తంగా ఉన్న రూ.50,000 కోట్ల అడ్వర్టైజింగ్ మార్కెట్‌ను కదిలించింది.
ప్రముఖ టీవీ ఛానెల్ యజమాని, ముంబైలోని BARC ఉద్యోగి ప్రేమ్‌నాథ్‌తో కలిసి రేటింగ్స్‌ను ఇష్టానుసారంగా మార్చినట్లు విచారణలో తేలింది.
ALSO READ:AP hostel food poisoning issue: విద్యార్థుల ప్రాణాలతో చెలగాటంపై లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఆగ్రహం
KTF ఫిర్యాదు ఆధారంగా కేరళ ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ చంద్రశేఖర్ దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ్‌నాథ్ ముందుగా రేటింగ్ అంకాలను పంపడం, PIN కోడ్‌ల ద్వారా వ్యూయింగ్ ప్యాటర్న్‌లపై ప్రభావం చూపడానికి సహాయపడినట్టు వాట్సాప్ చాట్‌లు, కాల్ రికార్డులు వెల్లడించాయి.
ఛానెల్ యజమాని USDT క్రిప్టో రూపంలో రూ.100 కోట్లకు సమీపంగా చెల్లింపులు చేసినట్టు ఆధారాలు లభించాయి. యూట్యూబ్ వ్యూస్ పెంచడానికి మలేషియా, థాయ్‌లాండ్‌లో ఫోన్ ఫార్మింగ్ నెట్‌వర్క్‌లు కూడా వాడినట్టు తెలిసింది.
ఈ మోసం ద్వారా ఆ ఛానెల్ అడ్ రెవెన్యూ పెంచుకుని, ప్రత్యర్థి ఛానెల్‌లకు నష్టం కలిగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
