JanaNayagan advance bookings: తమిళ హీరో విజయ్ నటిస్తున్న చిత్రంలో మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం “జననాయగన్”(JanaNayagan) యూకే (UK)అడ్వాన్స్ బుకింగ్స్‌తో సంచలనం సృష్టిస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరైన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ALSO READ:పేద విద్యార్థిని వైద్య విద్యకు భరోసా: హరీష్ రావు దాతృత్వం
ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, కేవలం 24 గంటల్లోనే 12.7 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి.
దీంతో యూకేలో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన తమిళ చిత్రంగా ‘జననాయగన్’ రికార్డు నెలకొల్పింది. గతంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లియో’ 24 గంటల్లో 10 వేల టికెట్లతో ఈ రికార్డును కలిగి ఉంది. తాజాగా ‘జననాయగన్’ ఆ మార్క్‌ను దాటింది.
విజయ్ చివరి సినిమా కావడంతో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనే అభిమానుల ఉత్సాహమే ఈ భారీ అడ్వాన్స్ బుకింగ్స్‌కు కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం “2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
