India Ricin Terror Threat: ఆముదం గింజలతో ఉగ్రవాదుల ఘోర ప్రయోగం

Castor seeds ricin poison terror plot uncovered by Indian security agencies Security agencies traced a terror plot involving ricin poison prepared from castor seeds in India

Ricin Poison Plot:దేశ భద్రతా విభాగాలను ఉలిక్కిపడేలా చేసే ప్రమాదకరమైన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఆముదం గింజల నుంచి తీసే ప్రాణాంతక విషం ‘రెసిన్’ (Ricin) ను ఆయుధంగా మార్చి దేశంలో విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు పన్నుకున్నట్లు సమాచారం.

కేవలం రెండు ఉప్పు రవ్వలంత పరిమాణంలో ఉన్న రెసిన్‌ కూడా మనిషిని చంపగలదు. ముఖ్యంగా, ఈ విషానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విరుగుడు లేకపోవడం భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాలుగా మారింది.

ఇటీవల గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన హైదరాబాద్ వైద్యుడు మొహియుద్దీన్ వద్ద 4 కిలోల ఆముదం గుజ్జు పట్టుబడటం ఈ కుట్రను బట్టబయలు చేసింది. సాధారణంగా లభించే ఆముదం గింజల(Castor Seeds)ను ప్రత్యేక విధానంలో ప్రాసెస్ చేసి ఈ విషాన్ని తయారు చేస్తారు.

ALSO READ:Telangana Cabinet Meeting:స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై నిర్ణయం? 

ఆన్‌లైన్‌లో కూడా ఈ గింజలు సులభంగా దొరుకుతుండటం పెద్ద భద్రతా ముప్పుగా మారిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైద్య నిపుణుల ప్రకారం రెసిన్‌ శరీరంలోకి చేరిన వెంటనే కణాల ప్రోటీన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. దీంతో అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేసి 36 నుంచి 72 గంటల్లో మరణం సంభవిస్తుంది. దీనికి ఎలాంటి ప్రత్యక్ష చికిత్స లేకపోవడం సమస్యను మరింత తీవ్రమైంది.

గతంలో బల్గేరియా నేత జార్జి మార్కోవ్ హత్యలో, అమెరికా అధ్యక్షుడికి పంపిన పార్శిల్‌లో కూడా ఈ విషం వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దేశీయ ఉగ్రవాద గ్రూపులు దీనిపై దృష్టి పెట్టడం భద్రతా సంస్థలకు నూతన సవాలుగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *