INDIA Alliance | బిహార్ ఓటమి తర్వాత ఇండీ కూటమి బలోపేతం 

Congress Congress

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమికి  గట్టిగానే ఎదురుదెబ్బ  తగిలింది. ఈ నేపథ్యంలో, కూటమి భవిష్యత్తుపై ఎదరైన సందేహాలకు కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. ప్రతిపక్ష ఇండీ కూటమిని బలోపేతం చేయడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని కాంగ్రెస్ ప్రకటించింది.

ఇండీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కూటమిలో ఎలాంటి మార్పులేవీ జరగలేదని, ఇకముందు మరింత సమన్వయంతో ముందుకు సాగుతామని AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) వెల్లడించారు.

ALSO READ:PM Modi G20 Summit: దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సుకు ప్రధాని మోదీ  

బిహార్ ఫలితాల తర్వాత కూటమి బలహీనపడుతుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టిన ఆయన, డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వింటర్ సెషన్‌లో ప్రతిపక్ష పక్షాలు ఏకతాటిపై పనిచేస్తాయని చెప్పారు.

ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో బలంగా వినిపించేందుకు ఇండీ భాగస్వాములు కలిసి వ్యూహాలు రూపొందిస్తారని వేణుగోపాల్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *