భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఐదవ, నిర్ణయాత్మక పోరుకు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం వేదికైంది. టాస్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకొని భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఆ నిర్ణయాన్ని భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు దూకుడు బ్యాటింగ్‌తో సవాల్ విసిరారు.
ALSO READ:తిరుపతి మామండూరులో పవన్ కళ్యాణ్ అటవీ పర్యటన సందడి
మొదటి ఓవర్ నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై చెలరేగిన టీమిండియా ఓపెనర్లు బౌండరీలతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. బెన్ ద్వార్షుయిస్ వేసిన తొలి ఓవర్‌లోనే 11 పరుగులు రాగా, ఐదో బంతికి గ్లెన్ మాక్స్‌వెల్ సులభ క్యాచ్‌ను వదిలేశాడు.
ఆ లైఫ్‌లైన్‌ను సద్వినియోగం చేసుకున్న అభిషేక్, గిల్ ఆగ్రెసివ్ షాట్లతో పరుగుల వర్షం కురిపించారు. కానీ, మధ్యలో వర్షం అంతరాయం కలిగించింది. ఆట ఆగే సమయానికి భారత్ 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది.

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగగా, వర్షం కారణంగా మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
