సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఉన్న రాక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఏసు ప్రభు జన్మదిన సందర్భంగా చిన్నపిల్లల ఆటపాటలు, యువతుల డ్యాన్సులు, క్రిస్మస్ క్యారల్స్ భక్తుల హృదయాలను ఉత్తేజపరిచాయి.
రంగురంగుల డెకరేషన్లు చర్చిని అందంగా అలంకరించగా, ప్రజలు మందిరాన్ని చూసి ఆనందించారు. వేడుకల్లో చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంఘం సభ్యులు మరియు భక్తులు ఈ పండుగను హర్షాతిరేకాల మధ్య జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా డీఆర్ఓ శ్రీమతి పద్మజారాణి, కాంగ్రెస్ ప్రతినిధులు శ్రీ తోపాజి అనంత కిషన్ తదితరులు విచ్చేశారు. వారు సంఘానికి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకలు విజయవంతంగా ముగిసినట్టు సంఘం సభ్యులు తెలిపారు.
పాస్టర్ ఏసు పాల్ మాట్లాడుతూ, ఈ నెల 31వ తేదీన వాచ్ నైట్ సర్వీసు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. వందలాది భక్తులు ప్రత్యేక ప్రార్థనల కోసం తరలిరావాలని పిలుపునిచ్చారు.