Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeBhadradriAswaraopeta(ST)ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ - 9 బైకులు స్వాధీనం

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ – 9 బైకులు స్వాధీనం

-

Chat on WhatsApp

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుండి దొంగిలించిన 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలను చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. భద్రాచలం రోడ్‌లో వాహన తనిఖీల సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది.

సీఐ కరుణాకర్ వివరాల ప్రకారం, ఎస్సై యాయాతి రాజు తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా, సరిపల్లి నరసింహారావు అనే వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా, అతడు 9 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు తేలింది.

నరసింహారావు వివిధ ప్రాంతాల్లో నుండి వాహనాలను దొంగిలించి, వాటిని మళ్లీ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగతనాల ద్వారా పొందిన వాహనాలను రికవరీ చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు.

ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సంతోష్ సహా ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నరసింహారావుని కోర్టు ముందు హాజరుపరచడం జరిగిందని సీఐ కరుణాకర్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp