గ్రామీణ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తుంది అని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి దేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే అన్నారు. శుక్రవారం పూడూర్ మండల పరిధిలోని కండ్లపల్లి గ్రామంలో బీటీ రోడ్డు కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రతి గ్రామానికి దశలవారీగా బీటి రోడ్డు అమలు చేయిస్తానని తెలియజేసినారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అదేవిధంగా నిజాంపేట్ మేడిపల్లి బ్రిడ్జి పనులు ప్రారంభించారు. నాలుగు లైన్ల రహదారులు శాంక్షన్ గురించి ముఖ్యమంత్రి కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని వెంటనే అమలు చేయిస్తారని తెలియజేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూడూరు మండల ఎంపీడీవో పాండు,సొసైటీ డైరెక్టర్ శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, శ్రీనివాస్ గుప్తా, అబ్రహం, గౌస్ ,కృష్ణ కుమార్ గౌడ్, సురేందర్ గౌడ్,రఘునాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ షకీల్, ఆనంద్ రావు ,భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం
