కాకినాడ జిల్లా కోటనందూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు జెండర్ మానవ అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు ప్రాజెక్టు ద్వారా సెర్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీ. అశోక్ భరత్ (హెచ్ఆర్ డిపిఎం), వి.బి.ఆర్. రాయ్ (పెన్షన్స్ ఇన్సూరెన్స్ డిపిఎం), అనిల్ కుమార్ (జెండర్ యాంకర్) పాల్గొన్నారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ వెలుగు ప్రాజెక్టు ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించారని, దీనికి తోడు సామాజిక వృద్ధికి జెండర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆహారం, పోషణ, ఆరోగ్యం, త్రాగునీరు ప్రజలకు అందుబాటులో ఉంటే సమగ్ర అభివృద్ధి సాధ్యమని, ఈ విషయాలను డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా శిక్షణ ఇవ్వడం లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య సభ్యులకు వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏపిఎం సూర్యకుమారి, వెలుగు సీసీలు, మండల మహిళా సమాఖ్య సభ్యులు, వివోలు, వీఎవోలు తదితరులు పాల్గొన్నారు. సమావేశం విజయవంతంగా ముగిసింది.