Flipkart Food Delivery Entry | స్విగ్గీ-జొమాటోకి..షాక్? | ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ?…

Flipkart Food Delivery Flipkart food delivery entry impact on Swiggy and Zomato shares in Indian stock market

Flipkart Food Delivery: వాల్‌మార్ట్ ఆధీనంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ‘Minutes’ పేరుతో క్విక్ కామర్స్ సేవలను అందిస్తున్న సంస్థ, ఇప్పుడు స్విగ్గీ(Swiggy)–జొమాటో(Zomato)లకు పోటీగా ఆహార సరఫరా విభాగంలో అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.

మే–జూన్ మధ్య బెంగళూరును కేంద్రంగా చేసుకుని పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశమున్నట్టు ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం పేర్కొంది. ప్రయోగం సఫలమైతే ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది పూర్తి స్థాయి సేవలు ప్రారంభించవచ్చని అంచనా. స్వంత స్టాండలోన్ యాప్ ప్రారంభించాలా? లేక ఓఎన్‌డీసీ వేదికపై బయ్యర్ సైడ్ అప్లికేషన్ తీసుకురావాలా? అన్న దానిపై సంస్థ అధ్యయనం చేస్తోంది.

అయితే ఈ వార్తలపై ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉండగా ఈ పరిణామాల ప్రభావంతో జొమాటో షేరు ఒక దశలో 2% పడిపోయి రూ.291.40కి చేరగా, స్విగ్గీ షేరు 3%కుపైగా నష్టంతో రూ.328 స్థాయికి దిగివచ్చింది. మార్కెట్లో పోటీ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *