ED Issues Notice to Kerala CM: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు సీఎం వ్యక్తిగత కార్యదర్శి అబ్రహం, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌లకు కూడా అందాయి.
2019లో జరిగిన మసాలా బాండ్‌ల జారీ ప్రక్రియలో విదేశీ మారకపు నిర్వహణ చట్టం (FEMA) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు తీసుకుంది.
ALSO READ:Kerala Trp Scam:టీఆర్పీ రేటింగ్స్ కోసం రూ.100 కోట్ల లంచం…కేరళలో బహిర్గతం
కేరళలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు సమీకరించే ప్రభుత్వ సంస్థ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్ (KIIFB) 2019లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో సుమారు రూ. 2,150 కోట్ల విలువైన మసాలా బాండ్‌లను జారీ చేసింది.
ఈ నిధుల సేకరణ ప్రక్రియలో ఫెమా రూల్స్ పాటించలేదని ఈడీ పేర్కొంటోంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఈ వ్యవహారం జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ మార్కెట్ల నుండి నేరుగా రుణాలు తీసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1)కి విరుద్ధం. ఈ నేపథ్యంలో కేఐఐఎఫ్‌బీ జారీ చేసిన మసాలా బాండ్‌లపై అనేక ప్రశ్నలు తలెత్తాయి.
అయితే కేఐఐఎఫ్‌బీ తమ కార్యకలాపాలు పూర్తిగా చట్టబద్ధమని, ఆర్బీఐ నిబంధనల ప్రకారం నడుస్తున్నాయని స్పష్టంచేస్తోంది. మసాలా బాండ్‌ల ద్వారా సమీకరించిన రుణాలు రాష్ట్ర బడ్జెట్‌లో భాగం కావని సంస్థ వాదిస్తోంది.
