Karnataka Politics:కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar), కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవచ్చని పరోక్షంగా సంకేతాలిచ్చారు.
ఇండిరా గాంధీ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, “ఎప్పటికీ కాంగ్రెస్ చీఫ్‌గా నేనే ఉండలేను“. ఇప్పటికే ఐదున్నర ఏళ్లుగా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. త్వరలో ఆరు సంవత్సరాలు పూర్తవుతాయి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి” అని వ్యాఖ్యానించారు.
ALSO READ:Trump on H1B Visas: ట్రంప్ యూటర్న్ వ్యాఖ్యలతో భారతీయులకు రిలీఫ్
2023లో ఉప ముఖ్యమంత్రి అయ్యాక రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, కానీ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అభ్యర్థన మేరకు కొనసాగానని వెల్లడించారు. “నేను పదవిలో ఉన్నానా లేదా అన్నది ముఖ్యం కాదు. పార్టీ కోసం ఎప్పుడూ పనిచేస్తాను” అని స్పష్టం చేశారు.
తరువాత మీడియాతో మాట్లాడుతూ, బాధ్యతల నుంచి పారిపోవడం లేదని, పార్టీ అధిష్ఠానం కోరినంత కాలం కొనసాగుతానని తెలిపారు. మరోవైపు, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలు నెలకొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎం సిద్ధరామయ్య ఢిల్లీలో గాంధీ కుటుంబంతో జరిగిన భేటీ తరువాత సమీకరణాలు వేడెక్కాయి.
