ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో విచారణ వేగం పెరిగింది. ఈ కేసులో నిందితుడిగా గుర్తించిన ఉమర్ నబీ(Umar Nabi) పేరుపై మరో వాహనం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఎరుపు రంగు(Delhi car blast)ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లాలోని ఖాండవాలీ గ్రామంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తు అధికారులు ఉమర్ నబీనే పేలిపోయిన ఐ20 కారు నడిపిన వ్యక్తిగా గుర్తించారు. అతని పేరుపై రెండవ కారు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పోలీసులకు ప్రత్యేక హెచ్చరికలు పంపారు. అన్ని చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీలను కఠినతరం చేశారు.
ALSO READ:H-1B Visa:హెచ్-1బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం
ఈ కారు కోసం ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కారు నెంబర్, వివరాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు.
చివరికి ఖాండవాలీ గ్రామంలో ఆ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు ద్వారా మరిన్ని ఆధారాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
