తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొడుకును తోసిన విషయంపై జరిగిన మాటామాటా పెరిగి, ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. తొలుత వాగ్వాదంగా మొదలైన వివాదం, కొందరు భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ ఘర్షణలో పదిమంది కలిసి ఓ భక్తుడిని చుట్టుముట్టి కొట్టారు. దీనికి ఆగ్రహించిన అతని తండ్రి చేతిలో ఉన్న గాజు బాటిల్‌ను తీసుకొని ఎదుటి వారిపై దాడి చేశాడు. గాజు బాటిల్ తలపై పడడంతో ఒక భక్తుడు తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో ఆసుపత్రికి తరలించబడాడు.
సీఆర్వో కార్యాలయం వద్ద జరిగిన ఈ ఘర్షణపై విజిలెన్స్ అధికారులు అప్రమత్తమై, ఘటనా స్థలానికి చేరుకుని భక్తులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు కారణమైన భక్తులను విచారిస్తున్నారు.
తిరుమలలో భక్తులు శాంతియుతంగా ఉండాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు వెల్లడించారు.