వేటపాలెం మండల పరిధిలోని నాయనపల్లి గ్రామం చల్లారెడ్డిపాలెం పంచాయతీ సచివాలయం సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కొత్త కాలవ స్టేట్ కట్ పక్కనే ఉన్న బొచ్చురోల పాలెం ఎత్తు పోతన పథకం సమీపంలో ఈ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
మృతదేహం సమీపంలో చేపలు పట్టే యానాదులు ఉండటంతో, వారు దీనిని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మృతదేహాన్ని చీరాల ఏరియా హాస్పిటల్‌కి తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు. మృతుడి గుర్తింపు వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం ఎవరిదో తెలుసుకునేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇది సహజ మరణమా? లేక మర్డరా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.