రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు:వాళ్లు డాక్టర్లు కాదు..టెర్రరిస్టులు
ఢిల్లీ పేలుడు ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే “రాజా సింగ్” తీవ్రంగా స్పందించారు. నిందితులుగా భావిస్తున్న కొందరి పేర్లను ప్రస్తావిస్తూ, వారు డాక్టర్లు కాదని, దేశాన్ని అస్థిరం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న ఉగ్రవాదులని ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు. రాజా సింగ్ మాట్లాడుతూ, “డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ అహ్మద్, డాక్టర్ షాహీన్, డాక్టర్ మొహియుద్దీన్ సయీద్, డాక్టర్ మొహమ్మద్ ఉమర్ వంటి పేర్లు వింటే, వారు వైద్యులు…
