Sunday, April 19, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshనిషేధిత బెట్టింగ్ యాప్ కేసులో సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

నిషేధిత బెట్టింగ్ యాప్ కేసులో సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

-

Chat on WhatsApp

సిట్:నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో భాగంగా ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఈ విచారణలో విజయ్ దేవరకొండ చేసిన ప్రమోషన్లు, వాటికి సంబంధించి తీసుకున్న పారితోషికం, కమీషన్లు, ఆర్థిక లావాదేవీల వివరాలపై సిట్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

సమాచారం ప్రకారం, సిట్ అధికారులు ఈ విచారణలో ఆ యాప్‌లతో ఉన్న ఒప్పంద పత్రాలు, ప్రమోషన్ చేసిన సమయం, చెల్లింపులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశాలపై కూడా ప్రశ్నిస్తున్నారు.

ALSO READ: ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మూడు కేసులు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు

ఈ కేసులో విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాశ్ రాజ్‌కు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వారి జాబితాలో పలువురు సినీ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో పూర్తి వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు సిట్ అధికారులు దశలవారీగా విచారణ కొనసాగిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఇచ్చిన వివరణల ఆధారంగా అవసరమైతే మరిన్ని ప్రముఖులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

oil tanker navigating through strait of hormuz amid iran naval tensions

Iran | ట్యాంకర్‌పై కాల్పులు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం?

Iran: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇరాన్‌కు చెందిన గన్‌బోట్లు ఒక చమురు ట్యాంకర్‌పై కాల్పులు జరపడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ప్రపంచ...
- Advertisement -
Chat on WhatsApp

Fatal error: Uncaught Error: Call to a member function hasAttribute() on int in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php:102 Stack trace: #0 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(102): WP_Optimize_Minify_Unused_Css->remove_unused_css() #1 /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/includes/class-wpo-page-optimizer.php(37): WPO_Page_Optimizer->maybe_remove_unused_css() #2 [internal function]: WPO_Page_Optimizer->optimize() #3 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/functions.php(5481): ob_end_flush() #4 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(341): wp_ob_end_flush_all() #5 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/class-wp-hook.php(365): WP_Hook->apply_filters() #6 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/plugin.php(522): WP_Hook->do_action() #7 /home/x2xsr35sfdqt/public_html/wp-includes/load.php(1308): do_action() #8 [internal function]: shutdown_action_hook() #9 {main} thrown in /home/x2xsr35sfdqt/public_html/wp-content/plugins/wp-optimize-premium/minify/class-wp-optimize-minify-unused-css.php on line 102