స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ

జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని రుద్రారం గ్రామంలో మొక్కలు నాటారు. మురుగు కాలువల పరిశుభ్రతను పరిశీలించారు. 5వ నుండి 9వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పచ్చదనం మరియు పరిశుభ్రతతో గ్రామాలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీవో దామోదర్, ఎంపీఓ గిరిజారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Read More

నాగార్జునసాగర్, పులిచింతలకు భారీ వరద, జలాశయాలు నిండుకుండలు

నాగార్జున సాగర్, పులిచింతలకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుల నీటి నిల్వ పూర్తి స్థాయికి చేరుకున్నాయి. నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో 3,19,408 క్యూసెక్కులు కాగా, దిగువకు 2,89,356 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల నిండు కుండలా మారింది. పులిచింతలలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరాం తాతయ్య కలిసి బుధవారం 13 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. తొలుత కృష్ణమ్మకు నేతలు పూజలు చేసి,…

Read More

నంద్యాలలో ఒక కూతురు తండ్రి అపార్థం కారణంగా ఆత్మహత్య. ‘నేను తప్పు చేయలేదు’ అని లేఖ

నేను ఏ త‌ప్ప చేయ‌లేదు నాన్న‌.. నువ్వే నమ్మకపోతే ఎలా.. అంటూ ఓ కూతురు త‌న తండ్రికి లేఖ రాసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. తనను తండ్రి అపార్థం చేసుకోవడంతో తట్టుకోలేకపోయిందామె. నాన్న దృష్టిలో దోషిగా నిలబడడం ఇష్టంలేక ప్రాణాలు తీసుకుంది. త‌న‌ గురించి అన్నీ తెలిసిన నాన్నే త‌న‌ను నమ్మకపోతే.. ఇంకెవరు నమ్ముతారు అంటూ బాధతో ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జ‌రిగింది.  అస‌లేం జ‌రిగిందంటే..నంద్యాల…

Read More

పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు అప్పగించిన కీలక బాధ్యత

డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ కు సీఎం చంద్రబాబు మరో కీలక బాధ్యతను అప్పగించారు. సోమవారం కలెక్టర్ ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ప్రజా పంపిణీ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు. అటవీ శాఖపై సమీక్ష సందర్భంలో .. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పెద్ద ఎత్తున…

Read More